పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Update: 2018-12-10 07:22 GMT

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. పంచాయతీ పాలక వర్గాల గడువు ఈ ఏడాది ఆగస్టులో ముగియడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల అంశాలపై ప్రతిపక్షాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా హై కోర్టు ఉత్తర్వులతో పంచాయతీ రాజ్ శాఖ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 13 నుంచి 14 వరకు గ్రామాల్లో బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించింది.
 

Similar News