రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో తెలంగాణ డీజీపీపై హైకోర్టు అసహనం

Update: 2018-12-05 09:47 GMT

రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిపై  హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్‌ నివేదికపై  న్యాయస్ధానం ప్రశ్నలు గుప్పించింది. ఇంటెలిజెన్స్ నివేదికపై సీల్‌, డేట్‌, టైం లేకపోవడంపై డీజీపీ న్యాయమూర్తిని ప్రశ్నించారు. అయితే తమ దగ్గర సీల్ ప్రాసెస్ లేదంటూ డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే తమ దగ్గర సీల్ విధానం లేదని హైకోర్టుకు తెలిపారు డీజీపీ. రేవంత్ ఆందోళనకు దిగుతారన్న సమాచారం ఉన్నప్పుడు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని.. కానీ వారంట్ లేకుండా అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడింది హైకోర్టు.

Similar News