వనపర్తి జిల్లాలో భారీ మద్యం డంప్‌ పట్టివేత

Update: 2018-11-25 08:12 GMT

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు సమీపంలోని జేఎం ఫాంహౌస్‌లో భారీ మద్యం పట్టుబడింది. గోదాంలో కాటన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 699 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ 20 నుంచి 25లక్షల రూపాయల వరకూ ఉంటుందని వనపర్తి డీఎస్పీ సృజన చెప్పారు. అయితే, ఈ మద్యం ఏ పార్టీకి చెందిన వారిదో ఇప్పుడే నిర్ధారించలేమని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆమె చెప్పారు. ఫాంహౌస్ ఓనర్ వెంకటస్వామి హైదరాబాద్లో ఉంటారని, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎక్సైజ్ శాఖకు అప్పగిస్తామని ఆమె తెలిపారు. 

Similar News