సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్: హరీష్ రావు

Update: 2018-06-07 09:02 GMT

గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా నాలుగేళ్లలో పూర్తి చేయించారన్నారు  భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావు..ముఖ్యమంత్రి కేసీఆర్ సోషనల్ ఇంజినీర్‌, సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉందన్నారు. కరువు జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, 6లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ 50వేల ఎకరాలకు కూడా నీరందించలేకపోయిందన్నారు. ఇంజినీర్లు, నీటి పారుదల శాఖ అధికారులు మంచి పనీతీరు కనబరుస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్‌కే జోషీ, నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు చెందిన ఇంజినీర్లు హాజరయ్యారు. 

Similar News