సంచలన నిర్ణయం తీసుకున్న గౌతం గంభీర్‌

Update: 2018-12-04 15:20 GMT

టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. జట్టుకు దూరమైన గంభీర్‌.. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌ లీగ్‌ల్లో మాత్రమే ఆడుతూ వచ్చాడు. మంగళవారం ఆకస్మాత్తుగా అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విటర్‌లో ప్రకటించాడు. దాంతో ఆయన అభిమానులు షాక్ లో మునిగిపోయారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ గౌతం గంభీర్‌కు చివరి మ్యాచ్ కానుంది. 37 ఏళ్ల గంభీర్‌ భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో 97 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే 2007 టీ20 ప్రపంచకప్‌ లో భారత్ విజయం సాధించడంలో గంభీర్ పాత్ర ఉంది. పాకిస్తాన్‌పై 2012లో చివరి టీ20 ఆడాడు గంభీర్.

Similar News