పవన్ టార్గెట్ ఎవరు..?

Update: 2018-03-12 10:36 GMT

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ అయితే వచ్చింది. మరి పవన్ కల్యాణ్.. నెక్ట్స్  ఏం చేయబోతున్నారు..? ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటున్న పవన్.. హోదా కోసం తన తర్వాతి పోరు ఎలా ఉండబోతోంది..? ఈ విషయంలో బీజేపీ, టీడీపీ పార్టీల తీరుణు కడిగిపారేసిన పీకే.. తన పార్టీ ఆవిర్భావ సభలో ఏం చెప్పబోతున్నారు..? తన ఫ్యూచర్  పాలిటిక్స్ పై క్లారిటీ ఇవ్వనున్నారా..? 

పవన్ టార్గెట్ ఎవరు..జనసేనాని ఎవరిని కార్నర్ చేయనున్నారు..తన పోరు ఎవరిపైనో అనే వివరణ ఇస్తారా..పీకే ఫ్యూచర్ పాలిటిక్స్‌పై క్లారిటీ ఇస్తారా..?

ఇవన్నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్న ప్రశ్నలు. అన్నింట్లో పర్‌ఫెక్ట్‌ అనిపించుకుంటున్న జనసేనాని పవన్ కల్యాణ్ వీటికి జవాబులు చెప్తారా లేదా అన్నదే ప్రస్తుతం తేలాల్సి ఉంది. మార్చ్ 14 న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న జనసేన పార్టీ  భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ సభలో అన్ని వర్గాల నుంచి వస్తున్న రకరకాల ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు ఇవ్వనున్నారు. అయితే ప్రత్యేక హోదా అంశంలో టీడీపీ, బీజేపీ పై గత కొంతకాలంగా వ్యతిరేక స్వరం వినిపిస్తున్న పవన్ సభలో మొత్త క్లారిటీ ఇస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

ప్రత్యేక హోదా విషయంలో తనకంటూ ఓ బాధ్యత ఉందని పవన్ కల్యాణ్  భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇటు టీడీపీ, అటు బీజేపీ లకు తాను మద్దతిచ్చినందున ఈ విషయంలో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు. ఇటీవలే ఈ అంశంపై జాయింట్ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ వేసి విషయాలను సేకరించారు. అలాగే న్యాయపోరాటం చేయాల్సి వస్తే ఎలా ముందుకు వెళ్లాలా అనేదానిపై కూడా పీకే క్లారిటీ ఇవ్వనున్నారు. 

ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కూడా జనసేనాని ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో నడిచిన పవన్ ఈ సారి ఆ అవకాశాలు లేవనే సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు పవన్ నుంచి ఎలాంటి ఆన్సర్లు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. దీంతో మార్చ్ 14 న పవన్ ప్రసంగం ఆసక్తి రేపుతోంది. 

Similar News