నకిలీ మహిళా ఎస్‌ఐ చేస్తున్న పని చూస్తే..

Update: 2018-07-18 04:03 GMT

నకిలీ నోట్లు, వస్తువులే కాక నకిలీ పోలీసులు కూడా పుట్టుకొస్తున్నారు. మంగళవారం తమిళనాడు తిరువణ్ణామలై తండ్రాంబట్టులో నకిలీ మహిళా ఎస్‌ఐ ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తండ్రాంబట్టు పోలీస్‌ స్టేషన్‌కు ఒక మహిళా ఎస్‌ఐ వచ్చారు. తాను చేనైలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాను. ఒక కేసు నిమిత్తం స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించాలని..విధుల్లో ఉన్న పోలీసులను అడిగింది. అయితే ఆ ఎస్‌ఐ యూనిఫామ్‌పై పేరులేదు. పైగా షూ ధరించలేదు. దీంతో సిబ్బంది అనుమానం వచ్చి  విచారించగా తాను నకిలీ ఎస్‌ఐనని చెప్పింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపెట్టింది.

'తాను పోలీస్‌ కావాలన్న ఆశయంతో రెండేళ్ల కిందట పోలీస్‌ ఎంపికకు జరిగిన రాత పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాను. దాంతో ఉద్యోగం రాలేదు. దీనిని అవమానంగా భావించి ఆరణిలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా చేరానని అందరితో చెప్పా. ఖర్చులకు నగదు అవసరమైతే ఒంటరిగా వస్తున్న వాహనాలను నిలిపి నగదు తీసుకుంటా. తిరువణ్ణామలై నుంచి తండ్రాంబట్టుకు ప్రైవేట్‌ బస్సులో టికెట్‌ తీసుకోకుండా వచ్చా. కండక్టర్‌కి అనుమానం రాకుండా బస్సును పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఎక్కి, దిగే దాన్ని'అని ఆమె చెప్పింది.  
 

Similar News