సీఎం చంద్రబాబు ఒప్పుకుంటే రెండేళ్లలో కట్టి చూపిస్తా : గాలి జనార్దనరెడ్డి

Update: 2018-06-24 10:28 GMT

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి వనరులు సహకరించవని ఇటీవల మెకాన్ సంస్థ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడాన్ని తప్పు బట్టారు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి.గతంలో తన బ్రహ్మణి స్టీల్స్‌కు కన్సల్టెంట్‌ మెకాన్ సంస్థేనని, ఫ్యాక్టరీ డిజైన్ కూడా ఆ సంస్థే ఇచ్చిందని.. అలాంటాప్పుడు డిజైన్ చేసే సమయంలో ఆ విషయం తెలియదా అని అన్నారు జనార్దనరెడ్డి. ఇప్పటికీ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పుకుంటే రెండేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించి చూపిస్తానన్నారు.అలా కుదరదనుకుంటే తానింత వరకూ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేసి, రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించుకోవచ్చన్నారు. 

Similar News