లావణ్య త్రిపాఠికి ఈ ఏడాది ప్రథమార్థం అంతగా కలిసి రాలేదు. ఈ సంవత్సరం ఆరంభంలో ఈ ముద్దుగుమ్మ నటించిన 'మిస్టర్', 'రాధ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మరో హీరోయిన్‌తో షేర్ స్క్రీన్ చేసుకున్న లావణ్య.. వారం గ్యాప్‌లో రానున్న రెండు కొత్త చిత్రాల్లో మాత్రం సోలో హీరోయిన్గా సందడి చేయనుంది. ఈ నెల 8న నాగచైతన్యతో లావణ్య జోడీకట్టిన 'యుద్ధం శరణం' విడుదల కానుండగా.. 15న సందీప్ కిషన్‌కి జంటగా నటించిన 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఇద్దరు హీరోయిన్స్‌లో ఒకరిగా నటించిన సందర్భంలో లావణ్యకి దక్కని విజయం.. సోలో హీరోయిన్‌గానైనా దక్కుతుందా? వేచిచూడాల్సిందే.