ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఈసీ షాక్ …బతుకమ్మ చీరలు, రైతుబంధు చెక్కులు..

Update: 2018-09-28 02:00 GMT

అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రభత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. మళ్లీ కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు ఎన్నికల కోడ్ ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. అంతేకాదు ఆపద్ధర్మ ప్రభుత్వాలకు కూడా ఈ నియమావళి వర్తిస్తుందని ఈసీ వెల్లడించింది. ఆపద్ధర్మ సీఎంగా విధానపరమైన, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని, కొత్త పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ రద్దయిన తర్వాత కూడా మెట్రో రైలు ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొని మంత్రి హోదాలో ప్రవర్తించినట్టుగా ఈసీకి పిర్యాదులు వచ్చాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ చీరలు, రైతుబంధు చెక్కుల పంపిణీ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని విపక్షాలు చెబుతున్నాయి. అలాగే ఇప్పటికే కొనసాగుతున్న పథకాల అమలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవన్నారు ఈసీ అధికారులు.

Similar News