ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...సిబ్బంది నిర్లక్ష్యాన్ని తెగిపడ్డ చిన్నారి బొటన వేలు

Update: 2018-09-24 06:54 GMT

డబ్బు పిచ్చితో  జనం మానవత్వం మరిచిపోతున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న వారు తప్పుదారి పడుతున్నారు. ఓ నర్సు నిర్లక్ష్యంగా చేసిన పని ఓ పసికందు నరకం అనుభవించాడు. పైగా అభంశుభం తెలియని చిన్నారి  ప్రాణాలమీదకు తెచ్చిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన  వనజ డెలవరీ కోసం ఈ నెల 3న కరీంనగర్‌ పెద్దాస్పత్రిలో చేర్పించారు. మరోసటి రోజు నార్మల్‌ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే ప్రసవించడం వల్ల బాబు ఏడవవడం లేదని ఇంక్యుబెటర్‌లో ఉంచారు. అయితే ఉదయం డ్యూటీలో ఉన్న సపోర్టింగ్‌ స్టాఫ్‌ బాబు చేతికి ఉంచిన బ్యాండేజీను తొలగించే క్రమంలో బాబు కుడి బొటనవేలును కట్‌ చేశారు.  జరిగిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ వేలును చెత్తబుట్టలో పడేశారు

చిన్నారి వేలుకు రక్తం కారడంతో  కాసేపు కంగారు పడ్డారు తల్లిదండ్రులు. ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడ్డారు. బాబు చేతికి ఎందుకు రక్తం కారుతుందని సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండ బయటకు పంపించారు. దీంతో అనుమానంతో పక్కనున్న చెత్తబుట్టలో చూడాగా చిన్నారి వేలును చూసి షాక్‌కు గురయ్యారు. జరిగిన విషయాన్ని అందరి దృష్టికీ తీసుకెళ్లారు. చెత్త బుట్టలో ఆ నర్సు పడేసిన బొటనవేలును తీసుకుని డాక్టర్లకు చూపించాడు. ఈ దారుణానికి  కారణమైన నర్సును ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.  

ఈ విషయం తెలుసుకున్న స్థానిక నేతలు ఆస్పత్రి చేరుకుని బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాబు బొటన వేలును కత్తిరించిన సిబ్బందిపై వెంటనే కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని బంధువులతో పాటు  ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గవర్నమెంట్‌ ఆస్పత్రిలో డబ్బులు ఇస్తేనే సిబ్బంది ట్రిట్‌మెంట్‌ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేరుకు పెద్దాస్పత్రే అయినా ఇక్కడ పైసా లేనిదే పల్స్‌ కూడా చూడారని మండిపడ్డారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రిలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Similar News