ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి అరెస్ట్..

Update: 2018-12-04 09:52 GMT

రేవంత్ రెడ్డి అరెస్ట్ ను సీపీఐ నేత కె.నారాయణ ఖండించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు. నిజాంపాలనలో కూడా ఇంత దౌర్జన్యం చూడలేదన్నారు. రేవంత్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని కె.నారాయణ డిమాండ్ చేశారు.  కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారనే నేడు రేవంత్ ఇంటిపై అర్థరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేయడంపై కెసిఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇలాంటి నీజ రాజకీయ కుట్రతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాగోంతుకను నొక్కెయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
 

Similar News