కర్ణాటక ప్రజలకు సీఎం కుమారస్వామి తొలిషాక్!

Update: 2018-07-05 11:59 GMT

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కర్ణాటక సీఎం కుమారస్వామి అక్కడి ప్రజలకు తొలి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర అసెంబ్లీలో గురువారం జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖనూ పర్యవేక్షిస్తున్న కుమారస్వామి మిగులు బడ్జెట్‌ను సాధించడమే తన లక్ష్యంగా స్పష్టం చేశారు. తొలి బడ్జెట్‌లోనే పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను భారాలను మోపారు. పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న పన్నును 30 నుంచి 32 శాతానికి, డీజిల్‌పై 19 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ 1.14, డీజిల్‌ రూ 1.12 మేర పెరగుతాయని చెప్పారు.

Similar News