రెబెల్‌ కాళ్లపై పడిన అభ్యర్థి...

Update: 2018-11-22 09:55 GMT

గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇంటింటి ప్రచారంతో ఓటర్లను నేరుగా కలుసుకోవడమే కాదు ప్రత్యర్థులను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడుతున్నారు. తాజాగా చేవేళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎస్ రత్నం అదే పార్టీ నుంచి రెబల్‌గా పోటీ చేస్తున్న పడాల వెంకటస్వామిని తనదారికి తెచ్చుకునేందుకు ఏకంగా ఆ‍యన కాళ్లపైనే పడ్డారు. నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకోవాలి వేడుకున్నారు. వయస్సులో పెద్దవారైన వెంకటస్వామి చెప్పినట్లే నడుచుకుంటానని ఆశీర్వాదం కావాలని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

Similar News