ఇకపై స్కార్ఫ్ ధరించారా..

Update: 2018-07-18 04:20 GMT

కొంతమంది  ఆడవాళ్లు బయటికి వెళ్లే సమయాల్లో ఎక్కువగా ముఖానికి స్కార్ఫ్ ధరించి వెళుతుంటారు. అయితే గతంలో ఇలా ధరించడం వలన అసాంగిక శక్తులు జనాలలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని పోలీసులు, ప్రభుత్వాలు భావించాయి. కానీ దీనిపై తరువాత ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. ఇదిలావుంటే మీరట్‌లోని చౌదరి చరణ్‌ సింగ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు స్కార్ఫ్ ధరించి క్యాంపస్‌లోకి  ప్రవేశించకూడదనే నిభందనను  అమల్లోకి  తీసుకువచ్చింది. భద్రతపరమైన చర్యల దృష్ట్యానే ఈ నిర్ణయం  తీసుకున్నట్లు వర్సిటీ  అధికారులు  వెల్లడించారు.  "స్కార్ఫ్‌ ధరించి యూనివర్సిటీలోకి ప్రవేశించడం వలన క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులా లేక బయటి వారా అనే విషయం గుర్తించడంలో సెక్యూరిటీకి కష్టమవుతుంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'  అని వర్సిటీ అధికారులు తెలిపారు.   ఇకపై స్కార్ఫ్  ధరిస్తే చర్యలు ఉంటాయని వారు విద్యార్థులకు సూచించారు. 

Similar News