నేడు లెక్క తేలుతుందా..?

Update: 2018-07-11 01:36 GMT

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత గడ్కరీ మొదటిసారిగా పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తో కలిసి పోలవరం పనులను పరిశీలించనున్నారు గడ్కరీ.. మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి చేరుకోనున్న గడ్కరీ.. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు రాజమండ్రికి చేరుకుని.. ప్రత్యేక విమానంలో విశాఖ బయల్దేరతారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు ముందురోజు ప్రాజెక్ట్‌ పురోగతిపై ఢిల్లీలో గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఇదిలావుంటే కొద్దిరోజులుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై నెలకొన్న అనిశ్చితి గడ్కరీ పర్యటనతో తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. 

Similar News