ఒంటెపాలు లీటర్ @రూ..3500..కారణం ఏంటంటే..

Update: 2018-07-10 04:40 GMT

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అని పెద్దలు అన్నారు. కానీ ఆవు పాలకు మించిన డిమాండ్‌ ఇప్పుడు ఒంటె పాలకు ఉంది. ఒంటె పాలకు భారత్ లో గిరాకీ  ఉన్నా లేకున్నా.. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 3వేల వరకూ పలుకుతోంది. అమెరికాలో అయితే ఏకంగా రూ. 3500 వరకూ పలుకుతుందంటే మాములు విషయం కాదు. దీంతోరాజస్థాన్ లోని ఒంటెల యజమానులకు ఈ వ్యాపారం ఓ వరంగా మారింది. వాస్తవానికి మూడేళ్ళ కిందటి వరకు ఒంటె పాలకు పెద్దగా రేట్ లేదు కానీ ఈ పాలు చాలా ఆరోగ్యకరమని కొన్ని జంతువులపై చేసిన పరీక్షల్లో వెల్లడవడంతో ఒంటె పాలకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. అయితే ఇంత రేట్ పెట్టి ఈ పాలను ఏం చేస్తారు అంటే.. వీటిలో సహజసిద్ధమైన ఇన్సులిన్‌ ఉందట. డయాబెటిస్‌ ఉన్న వారికి ఈ పాలు చాలా ఆరోగ్యకరమని పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు ఆటిజం, కీళ్లనొప్పుల పరిష్కారానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఇవి ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. మిగిలిన పాలతో పోలిస్తే లాక్టోజ్‌ శాతం కూడా చాలా తక్కువగా ఉన్న కారణంగా.. లాక్టోజ్‌ సహించని వారికి ఒంటెపాలు మంచి ప్రత్యామ్నాయమని వారు చెబుతున్నారు.

Similar News