బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు...ఏపీలో త్వరలోనే కొత్త ప్రభుత్వం...

Update: 2018-10-22 08:53 GMT

అగ్రిగోల్డ్‌ బాధితుల రిలే నిరాహార దీక్షలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని ఇందులో బీజేపీనే కీలక పాత్ర పోషింస్తుందిన ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన ప్రకటించారు. టీడీపీ తెలుగు దోపిడీ పార్టీగా మారిందన్నారు బీజేపీ నేత రాం మాధవ్‌. అగ్రిగోల్డ్ బాధితులకు మద్ధతుగా విజయవాడలో రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. అవినీతిలో దేశంలోనే నాల్గో స్ధానంలో ఏపీ ఉందన్నారు. టీడీపీలో ఆంబోతులుంటే తమ పార్టీలో మాత్రం సింహాలున్నాయన్నారు. తమ పార్టీ నేతలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించిన రామ్‌ మాధవ్‌ సభ్యత మరచి సంస్కారరహితంగా వ్యవహరిస్తున్న టీడీపీ మంత్రులకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. 
 

Similar News