మరోసారి క్రేజీ కాంబినేషన్ రెడీ..

Update: 2018-12-22 04:15 GMT

టాలీవుడ్ లో బాలయ్య, బోయపాటి లది క్రేజీ కాంబినేషన్ వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. అంతేకాదు అప్పటివరకు ప్లాపులతో సతమతమవుతున్న బాలయ్యకు.. బోయపాటే విజయాన్ని అందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న బాలకృష్ణ.. మరోసారి బోయపాటితో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. నిన్న రాత్రి ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక జరిగింది. వేడుకకు  బోయపాటి హాజరై మాట్లాడారు. 

'గతంలో మా కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ ఏ స్థాయి విజయాలను అందుకున్నాయనేది ప్రేక్షకులకు తెలిసిందే.  బాలకృష్ణ గారితో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాను.  ఈ సారి చేయనున్న సినిమా  'సింహా' .. 'లెజెండ్' లను  మించి ఉంటుందని అభిమానులకు మాట ఇస్తున్నాను. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళుతున్నాము .. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాము' అని అన్నారు. దాంతో బాలకృష్ణ తదుపరి చిత్రం బోయపాటితో అన్నవిషయం అభిమానులకు స్పష్టమైంది. 

Similar News