కంప్యూటర్లపై నిఘా పెడుతూ వెలువడ్డ ఉత్తర్వులపై దద్దరిల్లిన రాజ్యసభ

Update: 2018-12-21 11:18 GMT

కంప్యూటర్లలోని సమాచారాన్ని నియంత్రించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు కట్టబెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన 2009 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 69 ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లు వివరించారు. దీనివల్ల ఎవరి హక్కులకు భంగం కలగదని జైట్లీ చెప్పుకొచ్చారు. జైట్లీ సమాధానంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది పక్కా బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందంటూ కొట్టిపారేశాయి. దీనిపై మరోసారి జైట్లీ సమాధానం చెబుతూ దేశ సెక్యూరిటీ సంస్థలతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 

Similar News