జయలలిత మృతిపై డ్రైవర్ వెల్లడించిన రహస్యాలు ఇవే!

Update: 2018-06-29 03:25 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్‌ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌తో పాటు జయలలిత డ్రైవర్ కన్నన్‌ని విచారించింది ఈ కమిషన్ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న కన్నన్‌ వాంగ్మూలం ఇచ్చాడు. 'ఆ రోజున... తాను అమ్మ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్‌లో కూర్చుని ఉన్నారు... అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్‌ ఓపెన్‌ చేసి ఉన్నాయి... పెన్ను కాప్‌ కూడా తీసి ఉంది. వెంటనే వెళ్లి ఒక వీల్‌ చైర్‌ తీసుకు రావాలని, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చిన్నమ్మ(శశికళ) చెప్పిందని కన్నన్‌ వెల్లడించాడు. కొంతసేపటి తరువాత తాను, పీఎస్‌ఓ వీరపెరుమాళ్‌‌ చైర్‌ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్‌లో కూర్చొపెట్టామని.. అయితే రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్‌ నుంచి కింద పడిందన్నాడు. వెంటనే తాను, వీరపెరుమాల్‌ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించామని. కానీ తమ వల్ల కాలేదన్నాడు. దాంతో స్ట్రెచర్‌ తీసుకువస్తే బాగుంటుందని భావించామ'ని కన్నన్‌ కమిషన్‌ సభ్యులకు వివరించాడు.

Similar News