గణతంత్ర వేడుకలకు హాజరు కాలేకపోయిన సీఎం

Update: 2018-01-26 07:49 GMT

విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించింది. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్‌ నరసింహన్‌ ఎగురవేశారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ ప్రభుత్వ గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకాలేకపోయారు. కొద్ది రోజులుగా దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సమయానికి అమరావతి చేరుకోలేకపోయారు. విమానం ఆలస్యం కారణంగా సీఎం రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే సీఎం సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా... ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. విభజన కష్టాలను అధిగమిస్తూనే...పురోగమనంలో ముదుకు సాగుతున్నామని చెప్పారు. ఏపీలో 85శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారన్న గవర్నర్ నరసింహన్...,విభజన సమస్యలున్నా... రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. ప్రజలే ప్రథమ ప్రాధాన్యం అనే ధ్యేయంతో పని చేస్తున్నామన్నారు. 

Similar News