ఏపీలోని గ్రామీణప్రాంత ప్రజలకు శుభవార్త

Update: 2018-11-06 14:15 GMT

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇవాళ(మంగళవారం) అమరావతిలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో అన్న కాంటీన్, కడప ఉక్కు కర్మాగారం తదితర అంశాలపై చర్చ జరిగింది. క్యాబినెట్ భేటీలో 2019 జనవరి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్‌ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. మరోవైపు కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 15 నుంచి 18 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని కేబినెట్‌ అంచనా వేసింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వివిధ బ్యాంకుల నుంచి రుణ సమీకరణ చేయాలని ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కాల్వ శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపీ విభజన హామీలపై మరో మారు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేబినెట్‌లో‌ నిర్ణయించినట్టు మంత్రి కాల్వ చెప్పారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ లు అందుబాటులోకి వస్తే పేదవారు కడుపునింపుకునే అవకాశం ఉంది.

Similar News