నేడో రేపో జగన్ ను కలవనున్న మాజీ ఎమ్మెల్యే!

Update: 2018-06-29 02:27 GMT

ప్రకాశం జిలాల్లో వలసలు ఊపందుకున్నాయి. గడిచిన నాలుగేళ్లలో జిల్లానుంచి ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జిల్లానుంచే మళ్ళీ వలసలు ప్రారంభమవుతున్నాయి. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు వైసీపీ చేరనున్నారు. ఈ విషయాన్నీ  రాంబాబు స్వయంగా వెల్లడించారు.ఇప్పటీకే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన రాంబాబు.. నేడో రేపో  అధినేత వైయస్ జగన్ ను కలవనున్నారు.  కాగా 2009లో గిద్దలూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున రాంబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తుమల అశోక్‌రెడ్డి టీడీపీలోకి పిరాయించారు.అశోక్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని అన్నా రాంబాబు  తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిరాయింపులపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్య వైశ్య సామజికవర్గానికి చెందిన అయన వైసీపీలోకి వస్తే మార్కాపురం,  యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల ఓటర్లపై ప్రభావం చూపుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. వచ్చే వారం, జులై 8 వ తేదీన అన్నా  రాంబాబు వైసీపీలో చేరుతున్నట్టు అయన సన్నిహిత వర్గాలు అంగీకరిస్తున్నాయి. 

Similar News