మానవత్వం మంటగలిసింది.. ప్రాణాలు పోతున్నా సెల్ఫీలు దిగారు..

Update: 2018-07-11 14:03 GMT

రోజు రోజుకు సమాజంలో మానవతా  విలువలు మంటగలిసిపోతున్నాయి. రోడ్డు  ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడిల్పింది పోయి వారితో సెల్ఫీలు దిగారు.. ప్రాణం పోతుందని తెలిసి మరి క్షతగాత్రులను ఇబ్బందిపాలు చేశారు.  ఈ ఘటన రాజస్థాన్‌లో బార్మిర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం  బైక్ పై వెళుతున్న ముగ్గురిని  ఓ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో వారికి తీవ్రగాలయ్యాయి. దీంతో వారు రోడ్డు మీద పడి స్పృహ కోల్పోయారు. ఈ క్రమంలో  స్ధానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారికి సహాపడాల్పింది పోయి  రక్తమడుగుల్లో పడి ఉన్న వారితో సెల్ఫీలు దిగారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరిలించారు. వీరిలో ఒకరు అప్పటికే మృతి చెందగా మిగతా ఇద్దరు చికిత్స  పొందుతూ  ప్రాణాలు విడిచారు. కాగా సకాలంలో వీరిని ఆసుపత్రికి తరలించినట్టయితే బ్రతికేవారని పోలీసులు అన్నారు. స్థానికుల నిర్లక్ష్యం కారణంగానే వీరి ప్రాణాలు పోయాయి అనడంలో సందేహం లేదు.

Similar News