మటన్ పేరుతో కుక్క మాంసాన్ని అమ్ముతున్న కల్తీగాళ్లు

Update: 2018-11-19 11:36 GMT

మాంస ప్రియులకు మటన్ అంటే మక్కువ ఎక్కవ సండే వచ్చినా, ఇంటికి నలుగురు చుట్టాలొచ్చినా తినాలన్న కోరికి పుట్టినా, తినే అవకాశం వచ్చినా ఏమాత్రం ఆలోచించరు మటన్ షాపుల ముందు క్యూలు కడతారు హోటళ్లలో బిర్యానీలు లాగించేస్తారు ఇక రోడ్డు పక్కన నలబైకి, అరవైకి దొరికే మటన్ కర్రీలను కూడా కుమ్మేస్తుంటారు. 

ఇక్కడ మీకు కనిపిస్తున్నది మటన్ అనుకుంటున్నారా కానే కాదు అది కుక్క మాంసం.. అవును వినడానికే చిరాగ్గా అనిపించినా ఇది నిజం. ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని చెన్నైలోని ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి చెన్నై వచ్చిన జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ లో ఉన్న ఈ పార్శిల్ పై అనుమానం తో విప్పి చూసి పోలీసులు షాక్ కి గురయ్యారు. ఈ పార్శిల్‌లో వెయ్యి కిలోల మాంసం ఉంది. దాన్ని పరీక్షించగా.. అది కుక్కల మాంసంగా తేల్చారు. వెంటనే మాంసాన్ని సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. చెన్నైలోని రెస్టారెంట్లకు తరలించడానికే మాంసాన్ని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. 

Similar News