ఆన్ లైన్ లో వేంకటేశునికి కానుకల వెల్లువ!

కరోనా మహమ్మారి ఎంతలా భయపెడుతున్నా..తిరుమల శ్రీవారికి ఆన్ లైన్ లో విరాళాల వెల్లువ తగ్గలేదు. 

వేంకటేశ్వరుడి దర్శన భాగ్యానికి భక్తులు నోచుకోకపోతున్నా కానుకలు సమర్పించడంలో మాత్రం భక్తులు పోటీపడుతూనే ఉన్నారు. 

ఆన్‌లైన్ ద్వారా, గోవిందం యాప్ ద్వారా తోచినంతగా తిరుమలేశుని హుండీకి కానుకలు సమర్పించుకుంటున్నారు.

గత ఏడాది ఇలా ఆన్ లైన్ ద్వారా 90 లక్షల కానుకలు జమ కాగా, ఈ సంవత్సరం కూడా అంతే మొత్తంలో కానుకలు సమర్పించారు భక్తులు 

కరోనా సంక్షోభంలోనూ అంతే మొత్తంలో ఆన్‌లైన్ హుండీ ఆదాయం రావడం విశేషంగా చెబుతున్న టీటీడీ అధికారులు 



 



Update: 2020-05-19 03:34 GMT

Linked news