Vijay Mallya: విజయ్ మాల్యాకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా.? కళ్లు తిరగాల్సిందే..
Vijay Mallya: ఆర్థిక కుంభకోణాల కేసుల్లో భారత్‌ను విడిచి వెళ్లిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా... నేటికీ వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయారు. వ్యాపారంలో తెలివితేటలు ఉన్నప్పటికీ, నడిచిన మార్గాలు ఆయనను చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టాయి.
Vijay Mallya: విజయ్ మాల్యాకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా.? కళ్లు తిరగాల్సిందే..
Vijay Mallya: ఆర్థిక కుంభకోణాల కేసుల్లో భారత్‌ను విడిచి వెళ్లిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా... నేటికీ వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయారు. వ్యాపారంలో తెలివితేటలు ఉన్నప్పటికీ, నడిచిన మార్గాలు ఆయనను చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టాయి.
విజయ్ మాల్యా ఓ బిజినెస్ మాగ్నెట్, ఐపీఎల్ జట్టు యజమాని, రాజకీయ అనుభవజ్ఞుడు. అయితే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా కుదేలై మూసివేసిన తర్వాత నుంచి మాల్యా ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. బ్యాంకుల రుణాలు తిరిగి చెల్లించకపోవడం, ఆర్థిక అవకతవకలు వంటి ఆరోపణలతో 2016లో దేశం విడిచి వెళ్లిపోయారు. కాగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంత ఆస్తి ఉంది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాల్యా రుణాలు ఎంత, రికవరీ ఎంత?
విజయ్ మాల్యా ప్రకారం, ఆయనకు బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం రూ.4,000 కోట్లకు పైగా ఉండొచ్చని పేర్కొన్నారు. వడ్డీతో కలిపితే ఇది రూ.6,203 కోట్ల వరకు పెరిగింది. కానీ భారత ప్రభుత్వం అతని ఆస్తులను స్వాధీనం చేసుకుని దాదాపు రూ.14,131 కోట్ల మేర రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఇది తాను తీసుకున్నదాని కంటే రెట్టింపుగా ఉందని మాల్యా ఆరోపిస్తున్నారు.
ప్రస్తుత ఆస్తుల వివరాలు
మాల్యా పై అనేక కేసులు నడుస్తున్నా, ఆయన వద్ద ఉన్న ఆస్తుల విలువ ఇంకా భారీగానే ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ సంస్థలు భారత్‌లో మాల్యా ఆస్తులను జప్తు చేసినా, విదేశాలలో అతనికి ఇంకా అనేక విలువైన ప్రాపర్టీలు ఉన్నాయి.
ఫోర్బ్స్ UK ప్రకారం, 2013లో మాల్యా నికర ఆస్తుల విలువ $750 మిలియన్లు కాగా, 2022 నాటికి ఇది $1.2 బిలియన్‌కు పెరిగింది. ఇది మాల్యా వ్యాపార సామర్థ్యానికి నిదర్శనం.
విదేశాల్లో మాల్యా కలిగి ఉన్న విలాసవంతమైన ఆస్తులు
లండన్: కార్న్‌వాల్ టెర్రస్‌లో 18, 19 నెంబర్ల ప్లాట్లు – ఇది 19వ శతాబ్దపు ప్రతిష్టాత్మక భవనం
UK: హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో లేడీవాక్ మాన్షన్
ఫ్రాన్స్: సెయింట్-మార్గరైట్ ద్వీపంలోని లే గ్రాండే జార్డిన్ విల్లా – ఇది కేన్స్ సమీపంలో ఉన్న విలాసవంతమైన ఎస్టేట్
అమెరికా: న్యూయార్క్ ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్ (2010లో $2.4 మిలియన్లకు కొనుగోలు)
అదే భవనంలో మరో మూడు లగ్జరీ అపార్టుమెంట్లు వీటిలో రెండింటిని తన కుమార్తెతో కలిసి కొనుగోలు చేశాడు. కాలిఫోర్నియాలో కూడా అతనికి ఓ విలువైన భవనం ఉంది.
భారతదేశంలో మాల్యా ఆస్తులు:
ముంబై నేపియన్ సీ రోడ్‌లో ఓ బంగ్లా, బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్‌లో పెంట్ హౌస్, ఇతర విలువైన ప్రాపర్టీలు కూడా వివిధ నగరాల్లో ఉన్నట్టు సమాచారం.
వ్యాపారం నుండి వివాదాలకు..
28 ఏళ్ల వయసులో యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయిన మాల్యా, మద్యం వ్యాపారం, విమానయాన రంగం, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్‌లో పెట్టుబడులు పెట్టారు. ఫార్ములా 1 స్పాన్సర్‌షిప్‌లతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కానీ వ్యాపార విఫలమవడంతో పాటు చట్టబద్ధమైన వివాదాలు మాల్యాను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.