Indian Chocolate Market: ఏంటి మనోళ్లు ఇన్ని కోట్ల చాక్లెట్లు నమిలేస్తున్నారా రోజు

Indian Chocolate Market : వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7 రోజ్ డేతో ప్రారంభమవుతుంది. ఈ వారం రోజుల పువ్వుల నుండి చాక్లెట్ల వరకు ప్రతిదాని అమ్మకాలు భారీగా పెరుగుతాయి.

Update: 2025-02-06 05:44 GMT

Indian Chocolate Market: ఏంటి మనోళ్లు ఇన్ని కోట్ల చాక్లెట్లు నమిలేస్తున్నారా రోజు

Indian Chocolate Market : వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7 రోజ్ డేతో ప్రారంభమవుతుంది. ఈ వారం రోజుల పువ్వుల నుండి చాక్లెట్ల వరకు ప్రతిదాని అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఫిబ్రవరి 9 చాక్లెట్ డే కాబట్టి ఈ రోజున చాక్లెట్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. భారతదేశంలో కూడా చాక్లెట్ విలువ బిలియన్ల కొద్దీ ఉంటుంది. సాధారణ రోజుల్లో చాక్లెట్ల కొనుగోళ్లతో పోలిస్తే వాలెంటైన్స్ డే వారంలో బిలియన్ల విలువైన చాక్లెట్లు అమ్ముడవుతాయి. భారతదేశంలో చాక్లెట్ మార్కెట్ ఎంత పెద్దది.. ప్రేమికుల రోజున ఎంత వ్యాపారం జరుగుతుందో తెలుసుకుందాం.

భారతదేశంలో చాక్లెట్ మార్కెట్ ఎంత పెద్దది?

భారతదేశంలో చాక్లెట్ మార్కెట్ 2023 నాటికి 2.6 బిలియన్ డాలర్లకు అంటే రూ.21 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా. IMARC గ్రూప్ 2032 నాటికి చాక్లెట్ మార్కెట్ 5.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.2024-2032 మధ్య కాలంలో ఇది 7.7శాతం వృద్ధి రేటుతో పెరుగుతుందని అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ఆవిర్భావం, దేశీయ, అంతర్జాతీయ చాక్లెట్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా చాక్లెట్ మార్కెట్ కూడా పెరుగుతోంది. మొత్తం మార్కెట్‌లో వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ వంటివి వాటాను కలిగి ఉన్నాయి. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చాక్లెట్ బ్రాండ్లలో క్యాడ్‌బరీ, నెస్లే, ఫెర్రెరో రోచర్, అముల్, పార్లే, మార్స్, హెర్షే చాక్లెట్లు ఉన్నాయి.

వాలెంటైన్స్ డే నాడు ఎంత వ్యాపారం జరుగుతుంది?

ప్రేమికుల రోజున చాక్లెట్ వ్యాపారం బాగా పెరుగుతుంది. చాలా కంపెనీలు ఈ రోజున ప్రత్యేక చాక్లెట్ గిఫ్ట్ బాక్స్‌లను తయారు చేసి, లవ్ సింబల్ షేప్ పెట్టెల్లో చాక్లెట్‌లను విక్రయిస్తాయి. వాలెంటైన్స్ డే నాడు చాక్లెట్ల ధర రూ.50 నుంచి రూ.3 వేల వరకు ఉంటుంది. ప్రేమికుల రోజున చాక్లెట్లతో పాటు గులాబీలను కూడా కొంటారు. ప్రేమికుల రోజున చాక్లెట్ల తయారీ కంపెనీలు స్పెషల్ చాక్లెట్ హాంపర్లు కూడా తయారు చేస్తాయి. నేషనల్ కన్ఫెక్షనర్స్ అసోసియేషన్ (NCA) ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో వాలెంటైన్స్ డే చాక్లెట్ అమ్మకాలు ప్రతి సంవత్సరం సుమారు 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తాయి.

Tags:    

Similar News