క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త.. ఈ సూచనలు తప్పక తెలుసుకోండి!
దేశంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. షాపింగ్‌కి, రెస్టారెంట్‌కి వెళ్లినా చాలామంది క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ పేమెంట్స్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, తరచూ క్రెడిట్ కార్డు వాడే వారు జాగ్రత్తగా లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త.. ఈ సూచనలు తప్పక తెలుసుకోండి!
హైదరాబాద్: దేశంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. షాపింగ్‌కి, రెస్టారెంట్‌కి వెళ్లినా చాలామంది క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ పేమెంట్స్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, తరచూ క్రెడిట్ కార్డు వాడే వారు జాగ్రత్తగా లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పోలీసుల హెచ్చరికలు – తప్పక పాటించాల్సిన సూచనలు
ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు వెబ్‌సైట్ URLని తప్పనిసరిగా చెక్ చేయాలి.
అనుమానం కలిగిన లేదా గుర్తు తెలియని వెబ్‌సైట్‌లలో క్రెడిట్ కార్డు వివరాలు ఎప్పుడూ ఇవ్వకండి.
వెబ్‌సైట్‌లలో కార్డు వివరాలు సేవ్ చేయడం మానేయండి – మోసపూరిత చర్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
పబ్లిక్ పరికరాలు, ఫ్రీ వై-ఫై నెట్‌వర్క్‌లు ఉపయోగించకుండా ఉండాలి.
పేరున్న, ధృవీకరించిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి – ఇవి అధిక స్థాయి సెక్యూరిటీని అందిస్తాయి.
సైబర్ మోసాల నుంచి జాగ్రత్త
సైబర్ దాడులు, ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నందున ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఓ అవగాహన వీడియోను కూడా విడుదల చేశారు. ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో జాగ్రత్త వహించడం ద్వారా మాత్రమే మన ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.