UPI Transactions: యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌లో పెరగనున్న స్పీడ్

Update: 2025-05-01 16:15 GMT

UPI Payments: ప్రస్తుతం మనం ఏదైనా దుకాణానికి వెళ్లి యూపీఐ పేమెంట్ చేసినప్పుడు, ఆ పేమెంట్ అయినట్లుగా స్క్రీన్‌పై నోటిఫికేషన్ చూపించడానికి కొంచెం టైమ్ పడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు పేమెంట్స్ చేసినప్పుడు కూడా ఆ లావాదేవీలు పూర్తి అవడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ వెయిటింగ్ టైమ్‌ను సాంకేతిక భాషలో రెస్పాన్స్ టైమ్ అంటారు.

ఇంటర్నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా పేమెంట్ పూర్తవడానికి టైమ్ ఎక్కువ తీసుకుంటున్న సందర్భాలు కూడా చాలానే ఉంటున్నాయి. ఉదాహరణకు UPI పేమెంట్‌నే తీసుకున్నట్లయితే, చెల్లింపులు పూర్తయ్యాక మొబైల్ స్క్రీన్‌పై ఆ మెసేజ్ లేదా నోటిఫికేషన్ చూపించాకే వెళ్లాల్సి ఉంటుంది. అప్పటివరకు అక్కడే ఆగాల్సి వస్తోంది. అయితే, త్వరలోనే ఈ లేట్ పేమెంట్స్ ఇబ్బంది తప్పనుంది.

జూన్ 16వ తేదీ నుండి యూపీఐ పేమెంట్స్‌కు తీసుకునే సమయం 50 శాతం తగ్గనుంది. ఇప్పటికే గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూపీఐ పేమెంట్స్ యాప్స్‌కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) సర్క్యులర్ జారీచేసింది.

ఎన్సీపీఐ తాజా సర్క్యులర్ ప్రకారం ప్రస్తుతం 30 సెకన్ల సమయం తీసుకుంటున్న క్రెడిట్ , డెబిట్ కార్డు పేమెంట్స్ జూన్ 16 తరువాత 15 సెకన్లలోనే పూర్తి కానున్నాయి.

అలాగే ప్రస్తుతం 30 సెకన్ల సమయం తీసుకుంటున్న ట్రాన్సాక్షన్ స్టేటస్, ట్రాన్సాక్షన్ రివర్సల్, అడ్రస్ వ్యాలిడేషన్ వంటి పనులు ఇకపై 10 సెకన్లలోనే పూర్తి అవనున్నాయి. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కూడా ఎన్సీపీఐ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags:    

Similar News