UPI: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లూ జాగ్రత్త.. ఆగస్టు 1 నుంచి ఇవన్నీ మారిపోతున్నాయి!
యూపీఐ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, RBI మరియు NPCI వినియోగదారుల భద్రత, సిస్టమ్ స్థిరత్వం కోసం ఐదు కీలక మార్పులను అమలు చేయబోతున్నాయి. ఆగస్టు 1, 2025 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి.
UPI: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లూ జాగ్రత్త.. ఆగస్టు 1 నుంచి ఇవన్నీ మారిపోతున్నాయి!
UPI : యూపీఐ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, RBI మరియు NPCI వినియోగదారుల భద్రత, సిస్టమ్ స్థిరత్వం కోసం ఐదు కీలక మార్పులను అమలు చేయబోతున్నాయి. ఆగస్టు 1, 2025 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్‌లను ఉపయోగించే వారు ఇకపై కొన్ని పరిమితుల్లోనే సేవలు వినియోగించాల్సి ఉంటుంది.
కొత్త నియమాలు ఏంటంటే?
1. బ్యాలెన్స్ చెక్ లిమిట్:
ప్రతి యాప్‌లో రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంటుంది. రెండు యాప్‌లు ఉంటే గరిష్టంగా 100 సార్లు. UPI సర్వర్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇది తీసుకున్న చర్య.
2. బ్యాంక్ ఖాతా సమాచారం చెక్:
మీ మొబైల్ నంబర్ బ్యాంక్‌కి లింక్ అయ్యిందా లేదా అన్నది రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు. మొదటిసారి UPI యాప్‌ను యాక్టివేట్ చేస్తే మాత్రమే బ్యాంక్ లింక్ చెక్ చేసుకోవచ్చు.
3. ఆటో-పే పరిమితులు:
UPI ఆటో-డెబిట్ మ్యాండేట్‌లు పీక్ అవర్స్‌లో (ఉపాధి సమయంలో) పనిచేయవు. ఇవి ఆఫ్-పీక్ అవర్స్‌లో మాత్రమే అమలవుతాయి. చెల్లింపులు వినియోగదారుల ఖాతా నుంచి ఆ సమయంలోనే తీసుకుంటారు.
4. లావాదేవీ స్టేటస్ చెక్ పరిమితి:
చెల్లింపు స్థితి చూసే ప్రయత్నాలు రోజుకు గరిష్టంగా మూడు సార్లు మాత్రమే చేయవచ్చు. ప్రతి యత్నానికి 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.
5. యాప్‌లపై కొత్త నిబంధనలు:
ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు తమ API పర్యవేక్షణను కచ్చితంగా నిర్వహించాలి. లేదంటే NPCI జరిమానాలు విధించవచ్చు. ఆగస్టు 31 లోపు అన్ని చెల్లింపు యాప్‌లు సిస్టమ్ ఆడిట్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
ఈ మార్పులు వినియోగదారులకు తొలుత అసౌకర్యంగా అనిపించినా, దీని ద్వారా భద్రత మెరుగవుతుంది, సర్వర్‌లపై ఒత్తిడి తగ్గుతుంది. UPI వినియోగదారులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా, నియమాలకు లోబడి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.