Today Gold, Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
*హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది.
Representation Photo
Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 రూపాయలు తగ్గి పసిడి ధర రూ.49,150 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 690 తగ్గుదలతో రూ.45,050 కు చేరింది. ఇలా పసిడి ధర పడిపోగా వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. వెండి రేటు కూడా 900 రూపాయలు తగ్గి కేజీ వెండి ధర రూ.69,500 కు చేరింది.
దేశీయ మార్కెట్లో పసిడి ధర క్షీణించగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.85 శాతం క్షీణించి పసిడి రేటు ఔన్స్‌కు 1790 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం ఔన్స్‌కు 2.57 శాతం క్షీణతతో 23.57 డాలర్లకు చేరింది.