Stock Market: సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్
Stock Market: 622 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock Market: సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఐటీ స్టాక్స్ అండతో శుక్రవారం దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్ 80 వేల 893.5, నిఫ్టీ 24 వేల 592 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. తర్వాత కాస్త వెనక్కి తగ్గినా రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. మరోవైపు జూన్‌లో అమెరికాలో సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు కారణమైంది. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 622 పాయింట్ల లాభంతో 80 వేల 519.34 వద్ద ముగిసింది. నిఫ్టీ 186.20 పాయింట్ల లాభంతో 24 వేల 502 వద్ద స్థిరపడింది.