Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 241 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: 4.34 శాతం లాభపడ్డ విప్రో షేరు విలువ

Update: 2023-09-04 13:34 GMT

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, 241 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి 65 వేల628 వద్ద ముగియగా..నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 19వేల 529 వద్ద స్థిరపడింది. ఆసియా- పసిఫిక్‌ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు కలిసొచ్చాయి. చైనా, హాంకాంగ్‌ సూచీల్లో స్థిరాస్తి కంపెనీల షేర్లు రాణించడం ఈ ప్రాంత మార్కెట్లలో సానుకూలతలు నింపింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.

Tags:    

Similar News