Tesla: టెస్లా కార్ల కోసం తొలిసారి చార్జింగ్ స్టేషన్ ప్రారంభం... ఎక్కడో తెలుసా?
Tesla: టెస్లా కార్ల కోసం ఎదురు చూస్తున్న భారతీయ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఎలన్ మస్క్ భారతదేశంలో టెస్లా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు టెస్లా కార్ల కోసం చార్జింగ్ స్టేషన్లను కూడా ప్రారంభించారు.
Tesla: టెస్లా కార్ల కోసం తొలిసారి చార్జింగ్ స్టేషన్ ప్రారంభం... ఎక్కడో తెలుసా?
Tesla: టెస్లా కార్ల కోసం ఎదురు చూస్తున్న భారతీయ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఎలన్ మస్క్ భారతదేశంలో టెస్లా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు టెస్లా కార్ల కోసం చార్జింగ్ స్టేషన్లను కూడా ప్రారంభించారు. ఆగస్టు 4, 2025న ముంబైలో కంపెనీ తన మొదటి చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ అడుగు టెస్లా కార్ల విక్రయాలను, ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను పెంచడంలో సహాయపడుతుంది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని వన్ బీకేసీలో ఈ చార్జింగ్ స్టేషన్ ప్రారంభమైంది. ఇందులో నాలుగు V4 సూపర్ చార్జింగ్ స్టాల్స్, నాలుగు డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్ ఉన్నాయి. సూపర్ చార్జింగ్ స్టాల్స్ 250 కిలోవాట్ల వేగంతో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందిస్తాయి. దీని ఛార్జింగ్ ధర ప్రతి కిలోవాట్‌కు రూ.24. డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్ 11 కిలోవాట్ల వేగంతో ఛార్జింగ్ అందిస్తాయి. దీని ధర ప్రతి కిలోవాట్‌కు రూ.14.
టెస్లా కంపెనీ త్వరలో భారతదేశంలో మరిన్ని చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. సెప్టెంబర్ 2025 త్రైమాసికం నాటికి లోయర్ పరేల్, థానే, నవీ ముంబైలో మరో మూడు చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించనుంది. టెస్లా మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్లా మోడల్ Y రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని డెలివరీలు 2025 మూడో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని అంచనా.
లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.67.89 లక్షలు. దీని డెలివరీలు నాలుగో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితే, డెలివరీల గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. జులై 15న టెస్లా భారతదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. మోడల్ Y కారును విడుదల చేయడంతో పాటు కంపెనీ తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. గతంలో అధిక దిగుమతి సుంకాల కారణంగా టెస్లా భారతదేశంలోకి రావడానికి వెనుకడుగు వేసింది. అయితే, ఇప్పుడు మోడల్ Y కారును షాంఘై ప్లాంట్ నుంచి పూర్తిగా తయారు చేసిన యూనిట్‌గా భారతదేశంలో విక్రయిస్తున్నారు.