Tesla: భారత్ లో టెస్లాకు అంత ఈజీనేం కాదు.. టాటా, మహీంద్రాతో పోటీ కష్టమే
Tesla: ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా యజమాని ఎలోన్ మస్క్‌కి భారతదేశంలోవ్యాపారం అంత ఈజీనేం కాదు.
Tesla: భారత్ లో టెస్లాకు అంత ఈజీనేం కాదు.. టాటా, మహీంద్రాతో పోటీ కష్టమే
Tesla: ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా యజమాని ఎలోన్ మస్క్‌కి భారతదేశంలోవ్యాపారం అంత ఈజీనేం కాదు. ఇక్కడ వారు టాటా, మహీంద్రా వంటి భారతీయ కంపెనీల నుండి గట్టి సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ చెప్పిన విషయం. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి దేశీయ కంపెనీల నుండి కంపెనీ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటుందని, భారత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్‌లోకి టెస్లా ప్రవేశించడం అంత సులభం కాదని ఆయన అన్నారు.
ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. టెస్లా తన దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించడానికి ముంబైలోని అప్‌స్కేల్ బిజినెస్ ప్లేస్ అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఒక షోరూమ్‌ను ప్రారంభిస్తోంది. టెస్లా మహారాష్ట్రలో తయారీ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ అయిన టెస్లా భారతదేశ ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్‌కు ముప్పు కలిగించే విషయంగా మారనుంది.
ఎర్నెస్ట్ & యంగ్ 'ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుల కార్యక్రమంలో జిందాల్ మాట్లాడుతూ..టెస్లా, దాని సీఈవో ఎలాన్ మస్క్ లకు భారత మార్కెట్ సవాలుగా ఉండవచ్చని అన్నారు. "ఎలోన్ మస్క్ ఇక్కడ లేరు" అని జిందాల్ ఒక ప్యానెల్ చర్చ సందర్భంగా అన్నారు. అతను అమెరికాలో ఉన్నాడు. వాళ్లు భారతదేశంలో విజయం సాధించలేరు! మేము భారతీయులం ఇక్కడ ఉన్నాం. మహీంద్రా, టాటాలు చేయగలిగినది వారు చేయలేరని ఆయన అన్నారు.
జిందాల్ మాట్లాడుతూ.. “అతను చాలా తెలివైనవాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతను అంతరిక్ష నౌక వంటి వాటిలో చాలా స్పెషాలిటీ కలిగి ఉన్నాడు. తను అద్భుతమైన పని చేశాడు. కానీ భారతదేశంలో విజయం సాధించడం అంత తేలికైన పని కాదు. టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడానికి చర్యలు తీసుకుంటున్న తరుణంలో.. దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్న తరుణంలో జిందాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జిందాల్ ప్రకటన భారతదేశ ఆటోమొబైల్ రంగంలో కొనసాగుతున్న మార్పులను కూడా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కంపెనీలు ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి.