TAX: ఏఐ వచ్చిందిగా.. ఇక తెలుగులో ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు
TAX: ఐటీ రిటర్న్స్ చేసేందుకు ఫిన్ టెక్ సంస్థ కొత్త ప్రోగ్రాంని అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు తెలుగు భాషలోనే చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది.
TAX: ఏఐ వచ్చిందిగా.. ఇక తెలుగులో ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు
TAX: ఐటీ రిటర్న్స్ చేసేందుకు ఫిన్ టెక్ సంస్థ కొత్త ప్రోగ్రాంని అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు తెలుగు భాషలోనే చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది. దీనికోసం ఏఐ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత క్లియర్ టాక్స్ ఏఐ అసిస్టెంట్‌ను ఆవిష్కరించింది. దీంతో మీ వాట్సప్‌లోనే తెలుగులో చాటింగ్ చేస్తూ మూడు నిమిషాల్లో ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు.
ట్యాక్స్ ఫైల్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్‌లు ఉంటాయి. మధ్యవర్తులను నమ్మి.. వారు ఏం చెబితే అది చేయాలి. దీనివల్ల చాలామంది ట్యాక్స్ ఫైల్ చేయకుండా ఉండిపోతుంటారు. అయితే ఇలాంటి వారికోసం తెలుగులో చాట్ చేస్తూ 3 నిమిషాల్లో రిటర్న్స్ ఫైల్ చేసే ప్రాసెస్‌ను ఫిన్ టెక్ సంస్థ క్లియర్ టాక్స్ తీసుకొచ్చింది.
మధ్యవర్తుల సహాయం తీసుకోనవసరం లేకుండా నేరుగా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. కోటిమంది ట్యాక్స్ ఫైలర్లను వ్యవస్థ పరిధిలోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ఫిన్ టెక్ సంస్థ క్లియర్ టాక్స్ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఐటిఆర్ తీసుకొచ్చిన కొన్ని కొత్త రూల్స్ అధికమించకూడదు. ఒకవేళ అదిగమిస్తే భారీ జరిమానాలు కట్టాల్సి వస్తుంది.
ఐటిఆర్ తీసుకొచ్చిన కొత్త రూల్స్:
ఎటువంటి తప్పుడు ఐటిఆర్‌లను దాఖలు చేసినా వారి భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తారు.
సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.
ఈ కొత్త నిబంధనలు ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, వృత్తిలో ఉన్నవాళ్లు అందరికీ వర్తిస్తాయి.
ఆదాయాన్ని సరిగా చూపించకపోయినా, తప్పుడు మినహాయింపులు పెట్టినా, తప్పుడు ఐటీఆర్ ఫారమ్ ను ఎంపిక చేసుకున్నా జరిమానా తప్పదు
ఒక్కసారి మీరు ఇచ్చినది తప్పుడు సమాచారం అని పన్ను శాఖ గుర్తిస్తే చాలు.. భారీగా జరిమానా కట్టాల్సిందే
వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపించడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్‌లు క్లెయిమ్ చేసినా నేరమే
ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తే పన్ను చెల్లింపుదారుడు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతాడు.