Sundar Pichai: బిలయనీర్ల లిస్ట్‌లోకి సుందర్ పిచాయ్.. ఆయన నికర సంపద ఎంతంటే..

Sundar Pichai: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సిఈవో సుందర్ పిచాయ్ అరుదైన ఘనతను సాధించారు. తాజాగా ఆయన నికర సంపద పెరగడంతో బిలియనీర్ల లిస్ట్‌లోకి చేరిపోయారు.

Update: 2025-07-25 07:19 GMT

Sundar Pichai: బిలయనీర్ల లిస్ట్‌లోకి సుందర్ పిచాయ్.. ఆయన నికర సంపద ఎంతంటే..

Sundar Pichai: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సిఈవో సుందర్ పిచాయ్ అరుదైన ఘనతను సాధించారు. తాజాగా ఆయన నికర సంపద పెరగడంతో బిలియనీర్ల లిస్ట్‌లోకి చేరిపోయారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను బ్లూమ్ బర్గ్ సూచీ వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

టెక్ దిగ్గజం, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో, భారత అమెరికన్ సుందర్ పిచాయ్ ఇప్పుడు బిలీయనీర్‌‌గా మారిపోయారు. దాదాపు పదేళ్లుగా ఆ సంస్థలో సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ బిలియనీర్ల లిస్ట్‌లో చేరిపోయినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే.. ప్రస్తుతం సుందర్ పిచాయ్ నికర సంపద 1.1 బిలియన్ డాలర్లు దాటింది.

బిలియనీర్ల జాబితాలో చేరాలంటే కనీసం ఒక బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,300 కోట్లు నికర సంపద కలిగి ఉండాలి. అయితే ఫోర్బ్స్ వంటి ప్రచురణలు తమ బిలియనీర్ల జాబితాలో చేర్చడానికి నిర్ధిష్ట ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు 2023 నాటికి 2.7 బిలియన్ డాలర్ల నికర విలువ అవసరం ఉంటుంది. అయితే తాజాగా సుందర్ పిచాయ్ నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో వెల్లడించింది.

2023 నుంచి ఆల్ఫాబెట్ కంపెనీ షేర్లు బాగా రాణించడమే సుందర్ పిచాయ్ నికర సంపద పెరగడానికి కారణం. ఈ రెండేళ్లలో సంస్థ మార్కెట్ విలువ మరో ట్రిలియన్ డాలర్లు పెరిగి 2 ట్రిలియన్ డాలర్లు దాటించి. గురువారం నాటికి ఏకంగా ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్ షేర్లు 4.1 శాతం మేర లాభంతో ట్రేడ్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా సుందర్ పిచాయ్ నికర లాభం పెరిగింది.

అంతేకాదు టెక్ రంగంలో వ్యవస్థాపక సభ్యుడుగా సుందర్ పిచాయ్ బిలయనీర్ల లిస్ట్‌లో చేరడం అత్యంత అరుదైన విషయమని కూడా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఇదిలా ఉంటే సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 1993లో స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో స్కాలర్ షిప్‌ సాధించారు. అక్కడ చదువు పూర్తి చేసుకుని 2004లో ఓ సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లో చేరారు. సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసారు. గ్రూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్ ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు అన్నీ ఆయన ఆలోచనల నుంచి పుట్టికొచ్చినవే. ఈ కష్టానికి ఫలితమే ఆయన్ని 2015లో సీఈవోగా చేసింది. దాదాపే పదేళ్ల నుంచి ఆయన ఆల్ఫాబెట్ సీఈవోగా ఉన్నారు.

Tags:    

Similar News