SSY: రోజు రూ. 17 పొదుపు చేస్తే.. రూ. 3 లక్షలు పొందొచ్చు
Sukanya Samriddhi Yojana: ప్రస్తుతం చాలా మంది ఆలోచన మారుతోంది. పొదపు చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతోన్న ఖర్చులు, మారుతోన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది పొదుపు చేస్తున్నారు.
SSY: రోజు రూ. 17 పొదుపు చేస్తే.. రూ. 3 లక్షలు పొందొచ్చు
Sukanya Samriddhi Yojana: ప్రస్తుతం చాలా మంది ఆలోచన మారుతోంది. పొదపు చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతోన్న ఖర్చులు, మారుతోన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది పొదుపు చేస్తున్నారు. దీంతో అనేక రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
అలాంటి బెస్ట్ స్కీమ్స్‌లో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఆడ బిడ్డల చదువులు లేదా పెళ్లి సమయానికి ఉపయోగపడేలా ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకంలో రోజుకు రూ. 17 పెట్టుబడిగా పెట్టుకుంటూ పోతే ఏకంగా రూ. 3 లక్షలు సొంతం చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన (SSY)లో పెట్టుబడి చేస్తే భారీ లాభాలు పొందవచ్చు.
ఈ స్కీమ్ కింద పోస్టాఫీస్ లేదా బ్యాంకు ద్వారా ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతా ఓపెన్ చేయడానికి బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఐడీ ప్రూఫ్, చిరునామా రుజువు అవసరం. నెలకు కనీసం రూ. 250 నుంచీ గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ పథకంలో పెట్టుబడికి ఆదాయపన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ. 500 అంటే దాదాపు రోజుకు రూ. 17 చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెట్టారనుకుందాం. అలా మీరు 15 ఏళ్లలో మొత్తం ₹90,000 డిపాజిట్ చేస్తారు. దీనికి మీకు రూ. 1,87,103 వడ్డీ లభిస్తుంది. మొత్తం మెచ్యూరిటీతో కలిపి రూ. 2,77,103 సొంతమవుతుంది.
ఒకవేళ మీరు నెలకు రూ. 1000 పెట్టుబడి పెట్టారనుందాం. దీంతో మీరు 15 ఏళ్లలో ₹1.80 లక్షలు డిపాజిట్ చేస్తారు. దీనికి మీకు రూ. 3,74,206 వడ్డీ లభిస్తుంది. మొత్తం మెచ్యూరిటీ రూ.5,54,206 లభిస్తుంది. ఈ స్కీమ్ 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. కానీ బాలికకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత విద్య అవసరాల కోసం కొంత మొత్తం ముందుగానే తీసుకోవచ్చు.
ఒక్కో కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల ఖాతాలను ప్రారంభించవచ్చు. కవలలు అయితే ముగ్గురు పథకంలో చేరొచ్చు. ఇలా ప్రతీ రోజూ చిన్న మొత్తంలో పొదుపు చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ పొందొచ్చు.