Stock Market: లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 166, నిఫ్టీ 63 పాయింట్ల నష్టం
Stock Market: లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. నిన్నటి భారీ అమ్మకాల తర్వాత నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో కోలుకున్న మార్కెట్లు.. ఆఖర్లో మళ్లీ నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై పడింది. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 900కి పైగా పాయింట్లు లాభపడి.. చివరికి నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 24 వేల స్థాయిని కోల్పోయింది.