Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 2,222 పాయింట్ల నష్టంతో 78,759 వద్ద ముగిసిన సెన్సెక్స్
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకులాయి. 2వేల 222 పాయింట్ల నష్టంతో 78వేల 759 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 662 పాయింట్ల నష్టంతో 24వేల 55 వద్ద నిఫ్టీ ముగిసింది. బహిరంగ మార్కెట్‌లో 14 లక్షల కోట్ల సంపద ఆవిరయింది. నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక హెచ్‌యూఎల్, నెస్లే, టాటా కన్స్యూమర్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడ్డాయి. ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మీడియా, రియల్టీ 4శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.2 శాతం పతనమయ్యాయి.