Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు..

Stock Market: నిఫ్టీ 156.35 పాయింట్ల లాభం

Update: 2024-02-02 14:45 GMT

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు.. 

Stock Market: దేశీయ మార్కెట్లలో బడ్జెట్‌ జోష్‌ కనిపించింది. ఎన్నికల వేళ ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాల జోలికి పోకపోవడం మదుపరులను ఆకర్షించింది. మూలధన వ్యయానికి కేటాయింపులు పెంచడం మెప్పించింది. ముఖ్యంగా రిలయన్స్‌, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఓ దశలో భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు..

ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో ఓ మోస్తరు లాభాలకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 71వేల 977 పాయింట్ల వద్ద ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 14 వందల పాయింట్లకుపైగా లాభాల్లోకి దూసుకెళ్లింది. చివరికి 440.33 పాయింట్ల లాభంతో 72 వేల 85 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.35 పాయింట్ల లాభంతో 21 వేల 853.80 వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News