Stock Market: వరుసగా రెండో రోజు రాణించిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 692 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock Market: వరుసగా రెండో రోజు రాణించిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజూ రాణించాయి. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకోవడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ భేషరుతుగా మద్దతు తెలపడంతో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు లాంఛనం కానుంది. ఈనేపథ్యంలో పుంజుకున్న సూచీలు లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్ మళ్లీ 75 వేల మార్కు దాటింది. ఇంట్రాడేలో 75 వేల 297 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 692 పాయింట్ల లాభంతో 75 వేల 74 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్ల లాభంతో 22 వేల 821 వద్ద స్థిరపడింది.