Stock Market: బుల్ జోష్ .. దేశీయ మార్కెట్లు లాభాల బాట
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
Stock Market File Photo
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..ఆకర్షణీయ త్ర్రైమాసిక ఫలితాల అండతో గతవారం మార్కెట్లు లాభాల బాటన సాగగా.. తాజా వారంలోనూ అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు ఎగసి 48,857 వద్దకు చేరగా..నిఫ్టీ 46 పాయింట్ల మేర లాభంతో 14,680 వద్ద కదలాడుతున్నాయి..గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశంలో కొవిడ్-19 కేసుల పెరుగుదల, స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్‌లు, వ్యాక్సిన్‌ల కొరత వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపడం ఖాయమన్న అంచనాలు ఎదురవుతున్నాయి.