Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 52 పాయింట్ల లాభంతో 67,519 వద్ద ముగిసిన సెన్సెక్స్
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్లు లాభపడి 67వేల 519కి చేరుకుంది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 20వేల 103 వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవనకాల గరిష్ఠ పాయింట్లను నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.03 వద్ద నిలిచింది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.