Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Stock Market: 243 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. 86 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వెళ్లాయి. రియాల్టీ, ఐటీ రంగ షేర్ల నుంచి మద్దతు లభించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి 61 వేల 275కి చేరుకుంది. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 18 వేల 16 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఎయిర్ టెల్ లాభాల్లోకి వెళ్లగా.. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్‌ఫార్మా, L అండ్ T నష్టాలను మూటగట్టుకున్నాయి.