Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 149.85 పాయింట్ల లాభంతో 79,105 దగ్గర స్థిరపడిన సెన్సెక్స్
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఉదయం 79 వేల పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్... రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 149.85 పాయింట్ల లాభంతో 79వేల 105 దగ్గర ముగిసింది. నిఫ్టీ కేవలం 4 పాయింట్లు లాభపడి 24 వేల 143 దగ్గర స్థిరపడింది. అమెరికా ఎకనామిక్ డేటా పాజిటివ్ గా రావడంతో ప్రపంచ మార్కెట్లలో కొంత సానుకూలత నెలకొంది. దేశీయంగా వెలువడిన రిటైల్, హోల్ సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలూ పాజిటివ్ గా నిలిచాయి.