Revolt Motors: మళ్లీ మార్కెట్‌లోకి Revolt RV 400.. అక్టోబర్ 21 నుంచి బుకింగ్స్ ప్రారంభం..
*ఇది గరిష్టంగా 80 kmph వేగతో దూసుకెళ్తుంది * రివోల్ట్ RV 400 ధర ప్రస్తుతం రాష్ట్ర సబ్సిడీలతో కలిపి రూ .1.25 లక్షలు
Revolt RV400(ఫైల్ ఫోటో)
Revolt Motors: రివోల్ట్ మోటార్స్ సంస్థ కొత్త Revolt RV 400 బుకింగ్‌లను అక్టోబర్ 21న తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా 70 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. రివోల్ట్ మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రివోల్ట్ RV 400 ను 2019 సంవత్సరంలో మర్కెట్లోకి విడుదల చేసింది. ఇది దేశంలో వెంటనే ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కేవలం 6 భారతీయ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా దాని బుకింగ్‌లను మూసివేశారు. ఎందుకంటే పరిమితికి మించి బుకింగ్స్ రావడంతో కస్టమర్‌లకు సరైన సమయంలో డెలివరీ చేయని పరిస్థితి నెలకొంది. దీంతో కంపెనీ తన రివోల్ట్ RV 400 బుకింగ్‌లు అక్టోబర్ 21, 2021 న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది.
ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇప్పుడు మొత్తం 70 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంటుంది. రివోల్ట్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, RV 400 యొక్క కొత్త బ్యాచ్ బుకింగ్‌లు ఈ గురువారం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు ప్రారంభమైనప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వవచ్చు. కొన్ని వారాల క్రితం, రత్తన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ రివోల్ట్ కంపెనీలో గణనీయమైన వాటాను పొందడానికి 150 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. దీతో కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరిస్తోంది. ఇంతకు ముందు, రివోల్ట్ RV 400 ఆరు నగరాల్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు, ఏకంగా 70 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉండనుంది.
ఇది గరిష్టంగా 80 kmph వేగతో దూసుకెళ్తుంది. అలాగే, ఇది సింగిల్ ఛార్జ్‌పై ARAI- సర్టిఫైడ్ రేంజ్ 156 కిమీ కలిగి ఉంది. దీని బ్యాటరీని సాధారణ ఛార్జర్ ద్వారా 4.5 గంటల్లో చార్జ్ చేయవచ్చు. రివోల్ట్ RV 400 ధర ప్రస్తుతం రాష్ట్ర సబ్సిడీలతో కలిపి రూ .1.25 లక్షలు. వరంగల్, విజయవాడలలో కూడా షూరూంలను ప్రారంభిస్తున్నారు.