RBI Rules: ఆర్బీఐ కీలక ప్రకటన.. జనవరి నుంచి బ్యాంకు నిబంధనలలో మార్పులు..!

RBI Rules: ఆర్బీఐ కీలక ప్రకటన.. జనవరి నుంచి బ్యాంకు నిబంధనలలో మార్పులు..!

Update: 2022-12-25 08:01 GMT

RBI Rules: ఆర్బీఐ కీలక ప్రకటన.. జనవరి నుంచి బ్యాంకు నిబంధనలలో మార్పులు..!

RBI Rules: కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి బ్యాంక్ లాకర్ కు సంబంధించి కొత్త రూల్స్ అమలవుతున్నాయి. ఈ నిబంధనల వల్ల బ్యాంక్ కస్టమర్లకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది. లాకర్‌లో ఉంచిన వస్తువులకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి బ్యాంకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు వినియోగదారులు డిసెంబర్ 31 లోపు ఒక ఒప్పందంపై సంతకం చేయాలి. ఇందులో లాకర్ గురించిన మొత్తం సమాచారం ఉంటుంది. దీంతో బ్యాంకు ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.

లాకర్ ఒప్పందం

కొత్త సంవత్సరానికి ముందు అంటే జనవరి 1, 2023కి ముందు లాకర్ యజమానులు ఒక ఒప్పందాన్ని పొందవలసి ఉంటుంది. లాకర్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాలని ఖాతాదారులకు బ్యాంకుల నుంచి మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా తన కస్టమర్‌లకు హెచ్చరికను పంపుతోంది.

బ్యాంకు పరిహారం

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది. నిజానికి బ్యాంకు నిర్లక్ష్యం వల్ల లాకర్‌లో ఉంచిన వస్తువులు చెడిపోతే బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం బ్యాంకు బాధ్యత పెరిగింది. ఇది మాత్రమే కాదు బ్యాంకు ఉద్యోగులు మోసం చేయడం వల్ల కలిగే నష్టాన్ని బ్యాంకు భర్తీ చేస్తుంది.

Tags:    

Similar News